హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగావళిలో దూకి వృద్ధురాలు గల్లంతు

SKLM: ఫాజుల్‌బాగ్‌పేటకు చెందిన కొమ్మనాపల్లి భారతి (62) సోమవారం రాత్రి నాగావళి నదిలో దూకి గల్లంతయ్యారు. వాకింగ్‌కు వెళ్లిన ఆమె నదిలోకి దూకినట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజుల్లో ముగ్గురు గల్లంతవడంతో కొత్త వంతెన ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సై హైమావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.