హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన హమాలీ కృష్ణయ్య (40) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు 2 టౌన్ SI మహబూబ్ భాషా తెలిపారు. కుటుంబ కలహాలతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. మృతుడి తల్లి చిన్నక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.