హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

KDP: ఎర్రగుంట్ల- ముద్దనూరు రోడ్డులో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో రోడ్డు దాటుతున్న ఎర్రగుంట్లకు చెందిన రమణ (51) ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.