KDP: ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ సూచించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో 320 కేసులు నమోదు చేసి రూ.73,710 జరిమానా విధించినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, రాంగ్‌రూట్, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ ఉల్లంఘనలపై 320 కేసులు: ఎస్పీ


