NLG: ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. సోమవారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో యాసంగి సాగుపై రైతులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీటి లభ్యతను బట్టి తక్కువ నీటితో పండే పంటలను, మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుని సాగు చేయాలని సూచించారు.
తెలంగాణ
ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి: కలెక్టర్


