హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభానికి నోచుకోని నూతన పంచాయతీ భవనం

VKB: ధరూర్ మండలంలోని రాంపూర్ తాండ నూతన జీపీ భవనం 2 సం.రాల క్రితం పూర్తయినా, ప్రారంభానికి నోచుకోవడం లేదు. వినియోగానికి సిద్ధంగా ఉన్న ఇటువైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదు. పాడుబడ్డ పాత భవనంలోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని నియోజకవర్గ MLA, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామ సర్పంచ్ హీరీబాయి పేర్కొన్నారు.