హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంబీబీఎస్ సీట్లు సాధించిన అన్నదమ్ములు

WNP: గోపాల్‌పేట మండలానికి చెందిన ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు వైద్య విద్యలో ప్రతిభ చాటారు. దాసరి ఉషమ్మ - బాలరాజు దంపతుల కుమారులు శివశంకర్, రవిలు భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు సాధించి గ్రామానికి పేరు తెచ్చారు. వీరిని ఆదివారం యాదవ సంఘం పెద్దలు శాలువాలతో సన్మానించారు. ఉన్నత స్థాయికి ఎదిగి పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.