MHBD: కొత్తగూడ మండలం దుర్గారం చెందిన బోడ స్వప్న తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. మండల కాంగ్రెస్ మహిళా విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్న స్వప్న.. మంత్రి దనసరి అనసూయ (సీతక్క) చిత్రాన్ని తన ఎడమ చేతిపై శాశ్వత పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సీతక్క చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలనేదే తన లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: సీతక్కపై అభిమానంతో పచ్చబొట్టు


