హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి

NZB: నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి RSP కార్యదర్శి కటారి రాములు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఆర్‌ఎస్‌పీ కమిటీ ఆధ్వర్యంలో బాధితురాలితో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధిక బిల్లులు వసూలు చేసి, ప్రసూతి మహిళను ఇబ్బందులకు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఆసుపత్రిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.