హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీని మించిన ఆటగాడు లేడు: మాజీ క్రికెటర్లు

వెస్టిండీస్‌తో తొలి వన్డేలో కోహ్లీ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోహ్లీ నుండి యువ క్రికెటర్లు చాలా నేర్చుకోవాలన్నారు. రెండు నెలల విరామం తర్వాత మైదానంలో అడుగుపెట్టినప్పటికీ... పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడని చెప్పారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు విరాట్ మరింత ఉత్తమ ప్రదర్శన చేస్తాడని, ప్రపంచంలో కోహ్లీని మించిన ఆటగాడు మరొకరు ఉండరంటూ కితాబునిచ్చారు.