ప్రకాశం: కనిగిరి మండలంలోని చిన్న అలవలపాడు, తక్కెళ్లపాడు, బల్లిపల్లి గ్రామపంచాయతీలను సోమవారం ఎంపీడీవో శంకర్రావు సందర్శించారు. SWPC షెడ్లు, స్వచ్ఛ రథం బిన్ బ్యాగ్స్ నిర్వహణను పరిశీలించారు. ప్రతి పంచాయతీలో అక్టోబర్ నాటికి కనీసం ఒక టన్ను వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అక్టోబర్ నాటికి వర్మీ కంపోస్ట్ లక్ష్యం పూర్తి చేయాలి'


