హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలానికి స్వల్ప వరద

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2,498 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 23,826 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 854.90 అడుగులకు చేరింది. కాగా, శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది.