కృష్ణా: జాషువా కవిత్వం తెలుగు నేల నుంచి విశ్వమానవత వైపు సాగిన గొంతుక అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి, విశ్వనరుడు గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాషువా చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు


