హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంటు ప్రయాణాలు తాత్కాలికంగా నిలిపివేత

కోనసీమ: వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో సఖినేటిపల్లి లంక-నరసాపురం రేవు మధ్య పంటు ప్రయాణాలను అధికారులు సోమవారం తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వరద ప్రవాహం తగ్గిన అనంతరం పరిస్థితులను సమీక్షించి పంటు రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు.