AKP: నర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో ఇవాళ గుర్రం జాషువా జయంతి వేడుకలను గ్రంథాలయాధికారిణి పీ.దమయంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠకుడు బ్రహ్మానందస్వామి జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు పీ.ప్రభాకర్ మాట్లాడుతూ.. విశ్వమానవ సమానత్వం కోసం జాషువా పోరాడారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నర్సీపట్నం గ్రంథాలయంలో జాషువా జయంతి


