హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా భగత్‌సింగ్‌ జయంతి వేడుకలు

AKP: అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో భగత్‌సింగ్‌, గుర్రం జాషువా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు మారిశెట్టి వెంకట అప్పారావు ఆధ్వర్యంలో చిత్రపటాలకు గ్రామపెద్దలు శరగడం శివబాపు నాయుడు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు చేసిన సేవలను స్మరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.