హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అకస్మాత్తుగా బరువు తగ్గుతున్నారా..?

అకస్మాత్తుగా బరువు తగ్గితే జాగ్రత్తపడాల్సిందే. ఎటువంటి ప్రయత్నం లేకుండా బరువు తగ్గడం థైరాయిడ్, మధుమేహం, క్యాన్సర్ లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు సంకేతం కావచ్చు. ఇది పోషకాహార లోపం లేదా జీర్ణవ్యవస్థ సమస్యలను కూడా సూచిస్తుంది. అలసట, బలహీనత వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి పూర్తి వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.