హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటీన్‌లో మంత్రి సవిత తనిఖీ

సత్యసాయి: మంత్రి సవిత సోమవారం ఉదయం స్థానిక అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో ప్రజలకు అందిస్తున్న అల్పాహారాన్ని ఆమె పరిశీలించి, దాని నాణ్యతపై అధికారులను ఆరా తీశారు. అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి ఆహార రుచి, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. నిరుపేదలకు నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో అందించాలన్నారు.