PPM: వాయుగుండం ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు సీతంపేట ఏజెన్సీలో రహదారులన్నీ చిద్రమయ్యాయి. దీంతో గిరిజనులు తమ ఆటవీ ఉత్పత్తులు మార్కెట్‌కు తరలించడానికి, అత్యవసర వేళల్లో రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. బొమ్మిక, గజిలి, చాకలిగూడ రహదారి పూర్తిగా పెద్దపెద్ద రాళ్లు తేలిపోయాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
సీతంపేట ఏజెన్సీలో చిద్రమైన రహదారులు


