హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మారేడుమిల్లిలో వుడెన్ బ్రిడ్జి, ట్రీ హౌస్ సిద్ధం.. మంత్రికి ఆహ్వానం

తూ.గో: మారేడుమిల్లిలో ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన వుడెన్ బ్రిడ్జి, ట్రీ హౌస్‌ను సెప్టెంబర్ 30న ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను సోమవారం అధికారులు ఆహ్వానించారు. ప్రకృతి అందాల మధ్య ఏర్పాటు చేసిన ఈ ఎకో టూరిజం ప్రాజెక్ట్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుందని అధికారులు తెలిపారు.