హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధ్వానంగా పోలుకొండ– తమ్మిరిస రహదారి..!

కృష్ణా: నందివాడ ( M) పోలుకొండ- తమ్మిరిస గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై వర్షపు నీరు చేరడంతో ఇవాళ అధ్వానంగా మారింది. రహదారిపై గుంతలు ఏర్పడి నీటితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి, రహదారిపై నిలిచిన నీటిని తొలగించడంతోపాటు గుంతలను పూడ్చి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.