హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

9.64 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

తూ.గో: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో సోమవారం ఉదయం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.60 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 9,64,622 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు మూడు ప్రధాన పంట కాలువలకు 1,400 క్యూసెక్కుల సాగునీటిని వదులుతున్నారు.