SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలోని 13వ వార్డు విద్యానగర్ వీధిలో రూ.9.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీత విద్యాసాగర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం'


