హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గుర్రం జాషువా జయంతి

VZM: కవి కోకిల, పద్మభూషణ్ గుర్రం జాషువా సాహిత్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగాల నరసింగరావు అన్నారు. గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని మహాకవి గురజాడ అప్పారావు స్వగృహంలో జాషువా చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మానవత్వమే మహాన్నతమని జాషువా తన సాహిత్యం ద్వారా చాటి చెప్పారన్నారు.