హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఈ సందర్భంగా రానున్న పండుగలు దృష్ట్యా చర్లపల్లి-బ్రహ్మపూర్-చర్లపల్లి(రైలు నం.07027/28) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు వెల్లడించింది. ఈ రైలు అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నట్లు రైల్వే శాఖ సిపిఆర్ఓ శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.