PLD: నరసరావుపేట కాకాని సమీపంలోని జేఎన్టీయూ కాలేజీకి వెళ్లే విద్యార్థులు ఆర్టీసీ బస్సు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఒకే బస్సు నడుస్తుండటంతో సీట్లు సరిపోక కొంతమంది విద్యార్థులు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా మరో బస్సును ఏర్పాటు చేయాలని విద్యార్థులు అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
జేఎన్టీయూ విద్యార్థులకు బస్సు కష్టాలు


