హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇచ్చిన అప్పు తిరిగి రాక వ్యక్తి బలవన్మరణం

GNTR: ఇచ్చిన సొమ్ము తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన దాది శ్రీనివాసరావు స్థానికుడికి రూ.3.50 లక్షలు అప్పుగా ఇచ్చాడు. గడువు దాటినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర వేదనకు గురై గడ్డి మందు తాగాడు. తెనాలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.