హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నగంజాం PSలో ఎస్పీ తనిఖీలు

BPT: వార్షిక తనిఖీల్లో భాగంగా చిన్నగంజాం పోలీస్ స్టేషన్‌ను బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పరిశీలించారు. డ్రగ్స్, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల అరికట్టడానికి ‘ఆపరేషన్ త్రిశూల్’, హెల్మెట్ ధారణపై ‘శిరోరక్ష–ప్రాణరక్ష’ కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు. సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.