హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేడు ములుగులో కాంగ్రెస్ ర్యాలీ'

MLG: కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారాలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ములుగులో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెంకటాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరవుతారని తెలిపారు.