హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడల్లో రజతం.. సీఎం నగదు ప్రోత్సాహకం

ఆసియా క్రీడల్లో స్క్వాష్‌లో భారత క్రీడాకారుడు అభయ్ సింగ్ రజతం సాధించిన విషయం తెలిసిందే. దీంతో అతడికి తమిళనాడు సీఎం విజయ్ శుభాకాంక్షలు తెలిపారు. రూ.50 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. తమిళనాడులోని క్రీడాకారులకు అభయ్ గెలుపు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి.. దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు విజయ్ పేర్కొన్నారు.