హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు మరింత ప్రియం!

దసరా, దీపావళి పండుగల సీజన్‌ వేళ వినియోగదారులకు బిగ్ షాక్ తగలనుంది. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు పెరగనున్నాయి. ఏసీల ధరలు 5 నుంచి 8 శాతం వరకు అలాగే వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎల్‌ఈడీ టీవీల ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరగనున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ముడి పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని సమాచారం.