హైదరాబాద్: 28°C
వ్యాపారం

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్

వారంలో 5 పనిదినాల కోసం ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈనెల 28 నుంచి 30 వరకు సమ్మెకు దిగనున్నారు. దీంతో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఆ మూడు రోజులు ఏటీఎం లావాదేవీలపై అన్ని రుసుములను రద్దు చేస్తున్నట్లు ఎస్‌బీఐ సహా ప్రభుత్వ బ్యాంకులు ప్రకటించాయి. డిజిటల్ సేవలు వినియోగించుకోవాలని సూచించాయి. ఖాతాదారుల సౌకర్యార్థం ఈ నెల 27న(ఆదివారం) బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.