హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉరివేసుకుని రైతు ఆత్మహత్య

JN: జిల్లా బచ్చన్నపేట మండల శివారులో ఆలేరు రోడ్డు వైపు లిమ్రా ఫంక్షన్ హాల్ ఎదురుగా వ్యవసాయ బావి వద్ద పెద్ద చిట్టి దుర్గారెడ్డి (60) మృతి చెందారు. వ్యవసాయ బావి సమీపంలోని మోత్కు చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దుర్గారెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.