BDK: పాల్వంచ పట్టణ కేంద్రంలో అదివారం తూనికలు కొలతల అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా చికెన్ మటన్ చేపలు కూరగాయల దుకాణాలలో కొలతల పరికరాలను పరిశీలించారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కాటాలను గుర్తించి అధికారులపై చర్యలు చేపట్టారు. ఈ తనిఖీలో మొత్తం 12 కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
తూనికలు, కొలతల అధికారుల తనిఖీలు


