PDPL: తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ధర్మారంలో కళాకారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన త్యాగశీలి బాపూజీ అని కళాకారులు కొనియాడారు. ఆయన మార్గంలో పయనించాలని యువతకు సూచించారు. మండల కళాకారులు శ్రీనివాస్, రాజ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీకి కళాకారుల ఘన నివాళి


