హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంధకారంలో అన్నారం రోడ్డు

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డులో ఐదు రోజులుగా డివైడర్ మధ్యలో ఉన్న లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళలో వాహనదారులు, ప్రయాణికులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం అటువైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లైట్లు వెలిగేలా చూడాలని కోరుతున్నారు.