హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖో-ఖో రాష్ట్రస్థాయి జట్ల ఎంపిక

MDK: జిల్లా ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ ఖో-ఖో జిల్లా జట్ల ఎంపికలు తూప్రాన్ TGRS & JCలో నిర్వహించారు. 277 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. రాష్ట్రస్థాయి పోటీలకు మెదక్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించే జట్లను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెలలో హాలియాలో నిర్వహించనున్న పోటీలలో పాల్గొంటారని తెలిపారు.