హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోతుల బెడదతో మండల ప్రజల అవస్థలు

NZB: సిరికొండ మండలంలో కోతుల సంచారం పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గుంపులుగా ఇళ్ల వద్దకు చేరి పైకప్పులపై హల్‌చల్ చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. కోతుల బెడదను నివారించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.