TG: వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరను నిర్వహించనున్నట్లు పూజారులు ప్రకటించారు. ఫిబ్రవరి 17న సారలమ్మ గద్దెను చేరడంతో జాతర ప్రారంభమవుతుందని, 18న సమ్మక్క రాక, 19న భక్తులు మొక్కులు చెల్లించుకోవచ్చని తెలిపారు. 20న వనదేవతల తిరుగుప్రయాణంతో మినీ జాతర ముగుస్తుందని వారు వెల్లడించారు.
భక్తి
మేడారం మినీ జాతర తేదీలు ఖరారు


