తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 82,181 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,633 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తి
శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు


