హైదరాబాద్: 28°C
భక్తి

భారీ డిమాండ్ కారణంగానే బుకింగ్‌లో పోటీ: TTD

AP: తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌పై భక్తుల సందేహాలకు TTD వివరణ ఇచ్చింది. కోటాతో పోలిస్తే డిమాండ్ 9 రెట్లు ఎక్కువగా ఉండటంతో తక్కువ సమయంలోనే టికెట్లు పూర్తవుతున్నాయని తెలిపింది. ఆధునిక సాంకేతికతో వ్యవస్థను పటిష్ఠంగా నిర్వహిస్తున్నామని, టికెట్ రాకపోవడాన్ని ఆన్‌లైన్ వ్యవస్థ పనిచేయకపోవడంగా భావించవద్దని TTD స్పష్టం చేసింది.