హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం

KMM: చింతకాని మండలం నరసింహాపురంలో ఇటీవల మృతిచెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నన్నక లచ్చయ్య కుటుంబాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం పరామర్శించారు. లచ్చయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొన్నారు.