HNK: హన్మకొండ బాలసముద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వృద్ధుడి మూత్రాశయం నుంచి 700 గ్రాముల భారీ రాయిని వైద్యులు అరుదైన శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. మూత్రవిసర్జనలో మంట, సరిగా మూత్రం రాకపోవడంతో పరీక్షలు చేయగా 11.5×9.5 సెం.మీ. రాయి ఉన్నట్లు గుర్తించారు. యూరాలజిస్ట్ డా. గీతాంజలి నరేష్ ఆధ్వర్యంలో Open Cystolithotomy చేసి రాయిని విజయవంతంగా తొలగించారు.
తెలంగాణ
700 గ్రాముల రాయి తొలగింపు


