MDK: రామాయంపేట మండల కేంద్రంలో గణేష్ నవరాత్రుల శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో ముగిసింది. గత రాత్రి నుంచి నేటి మధ్యాహ్నం వరకు కనులపండువగా సాగిన ఊరేగింపులో 70 భారీ విగ్రహాలను నిమజ్జనం చేశారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ సైదా నాయక్, ఎస్సై బాలరాజు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ లావణ్య నాగరాజు, కమిషనర్ రవీందర్, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రశాంతంగా ముగిసిన గణేష్ శోభాయాత్ర


