హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRP ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షుడిగా జగన్

RR: కొడంగల్‌ బహిరంగ సభలో టీఆర్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షుడిగా ఆవ జగన్‌కు నియామక పత్రం అందజేశారు. షాద్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎమ్మె సంతోష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకమై రాజ్యాధికారం దిశగా యుద్ధానికి సిద్ధం కావాలని మల్లన్న పిలుపునిచ్చారు.