KKD: తొండంగి(M) బెండపూడి వద్ద హైవేపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న పలివెలరాజా, కర్రిశివాజీ అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతులు చిన్ననాటి స్నేహితులు కావడంతో స్వగ్రామం కొత్తూరులో విషాద చాయలు నెలకొన్నాయి. చావులోనూ స్నేహం వీడలేదంటూ గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి


