హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదాల నివారణకు జిగ్‌జాగ్‌ బారికేడింగ్‌

PLD: చిలకలూరిపేట పట్టణంలో ప్రమాదాల నివారణకు జిగ్‌జాగ్‌ బారికేడింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు అర్బన్‌ సీఐ రమేష్‌ తెలిపారు. బ్లాక్‌స్పాట్లు, హాట్‌స్పాట్లను గుర్తించి వేగ నియంత్రణ, లైటింగ్‌, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. వాహనదారులు హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ధరించి, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయకుండా ట్రాఫిక్‌ రూల్స్ పాటించాలన్నారు.