ATP: రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈనెల 29న అగ్రి ఎక్స్‌పో-కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేళాకు జిల్లా నలుమూలల నుంచి 500 మందికి పైగా రైతులు హాజరుకానున్నారు. రబీ సాగు, ఆధునిక పద్ధతులపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు.
ఆంధ్రప్రదేశ్
29న అగ్రి ఎక్స్‌పో-కిసాన్ మేళా: కలెక్టర్


