హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్ కాంప్లెక్స్ వద్ద తప్పిన ప్రమాదం

అనకాపల్లి బస్ కాంప్లెక్స్ సమీపంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. వాల్తేరు వెళ్తున్న బస్సు బయటకు వస్తుండగా, సింధియా వైపు నుంచి వస్తున్న మరో బస్సు దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ప్రయాణికులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.