హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాము కాటు.. పరిస్థితి విషమం

TPT: కేవీబీపురం మండలం కాట్రపల్లికి చెందిన నాగలాపురం చిట్టిబాబు(42) ఆదివారం ఉదయం పాము కాటుకి గురుయ్యారు. తొలుత కేవీబీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం శ్రీకాళహస్తి, రేణిగుంటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.